టీడీపీ మహానాడుపై రోజా తీవ్ర విమర్శలు

  • 'మహానాడు'ను 'దగానాడు'గా అభివర్ణించిన రోజా
  • అక్రమ కేసులతో వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపాటు
  • సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ నేతలు విమర్శల జోరు పెంచారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి పాలనపై, ముఖ్యంగా నారా లోకేశ్ పదోన్నతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


టీడీపీ నిర్వహిస్తున్న మహానాడును ‘దగానాడు’గా అభివర్ణించిన రోజా... వైసీపీ నేతలను అక్రమ కేసులతో భయబ్రాంతులకు గురిచేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జగన్ చేసిన అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సొంతంగా ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క పనినైనా చూపించగలదా అని ప్రశ్నించారు. అలాగే ఎన్నికల ముందు ప్రకటించిన 'సూపర్ సిక్స్' పథకాలు ఏమయ్యాయని, అవి సూపర్ హిట్ ఎలా అయ్యాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


నారా లోకేశ్ విద్యాశాఖ మంత్రి కాగానే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటుపడిందని విమర్శించిన రోజా... మంత్రిగానే సరిగ్గా పని చేయని లోకేశ్‌ను ఇప్పుడు ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎలా చేశారని నిలదీశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రశ్నిస్తానన్న నాయకుడు (పవన్ కల్యాణ్) ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మహానాడులో లోకేశ్ ప్రకటించిన 33 శాతం మహిళా రిజర్వేషన్లపై స్పందిస్తూ.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదని, ఇప్పుడే ఎందుకు అన్నీ గుర్తుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కూటమి మోసాలను ఎండగట్టేందుకు జూన్ 4 నుంచి వైసీపీ ప్రజల్లోకి వెళుతుందని రోజా స్పష్టం చేశారు.



Roja
RK Roja
Mahanadu
YS Jagan
Nara Lokesh
Andhra Pradesh Politics
Telugu Desam Party
YSRCP
Super Six Schemes
Andhra Pradesh Government

More Telugu News